
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో వస్తున్న యాత్ర సినిమాలో వైఎస్సార్ తండ్రి రాజా రెడ్డిగా సీనియర్ స్టార్ జగపతి బాబు నటిస్తున్నారు. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేస్తున్న యాత్ర సినిమా నుండి రాజా రెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వైట్ ఖద్దర్ షర్ట్, పొడవాటి మీసంతో రాజా రెడ్డిగా జగపతి లుక్ అదిరిపోయింది. యాత్రలో రాజా రెడ్డి పాత్ర నిడివి తక్కువే అయినా జగపతి బాబు అయితే అందుకు పర్ఫెక్ట్ అని ఆయన్ను ఎంచుకున్నారట.
మళయాళ స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్సార్ గా నటిస్తున్నారు. యాత్ర సినిమా టీజర్ వై.ఎస్ అభిమానులను మెప్పించింది. రిలీజైన మొదటి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ యాత్ర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అసలే బయోపిక్ సీజన్ నడుస్తున్న టాలీవుడ్ లో వైఎస్సార్ యాత్ర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి యాత్ర సినిమా నిర్మిస్తున్నారు.