రామ్ పూరి 'ఇస్మార్ట్ శంకర్'

ఎనర్జిటిక్ స్టార్ రామ్ క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. రామ్ లోని స్టైల్ ను మొత్తం బయటకు తీసి చూపించాడు పూరి. స్టైలిష్ లుక్ తో ఇస్మార్ట్ శంకర్ గా క్రేజీ ఫస్ట్ లుక్ తో వచ్చాడు రామ్.   

డబుల్ సిమ్ కార్డ్.. డబుల్ ధమాకా హైదరబాదీ అంటూ ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద అంచనాలు పెంచారు. పూరి స్టైల్ ఆఫ్ టేకింగ్ పోస్టర్ లో కనిపిస్తుంది. అయితే ఇలా పోస్టర్, టీజర్ తో మ్యాజిక్ చేయడం పూరికి కొత్తేమి కాదు మరి అసలు సినిమాలో కంటెంట్ ఉందో తెలియాల్సి ఉంది. రాం లుక్ మాత్రం అతని ఫ్యాన్స్ కు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. వరుస ఫ్లాపులతో షాకుల మీద షాకులు తిన్న పూరి ఈసారైనా హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి.