
కన్నడ సినిమాలు తెలుగులో పెద్దగా హిట్ అయ్యిన సందర్భాలు లేవు. కాని కె.జి.ఎఫ్ తో కన్నడ డబ్బింగ్ సినిమా కూడా సంచలనాలు సృష్టించగలదు అని ప్రూవ్ చేశాడు రాకింగ్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతో పాటుగా రిలీజైన రెండు తెలుగు సినిమాలు చతికిల పడగా కె.జి.ఎఫ్ ఇప్పటికి మంచి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటివరకు తెలుగులోనే కె.జి.ఎఫ్ 10 కోట్ల పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తుంది.
కె.జి.ఎఫ్ సినిమాను తెలుగులో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి కె.జి.ఎఫ్ హీరోతో అదేనండి యశ్ తో డైరెక్ట్ తెలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను యశ్ కు సూటయ్యే కథని సిద్ధం చేయమని చెప్పాడట. ఎలాగు సాయి కొర్రపాటి వారి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి విజయేంద్ర ప్రసాద్ కాదనే ఛాన్స్ లేదు. మొత్తానికి యశ్ తో సాయి కొర్రపాటి పెద్ద్ స్కెచ్చే వేశాడని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి ఎలా ఉంటుంది అన్నది మాత్రం కొద్దిరోజుల్లో బయటకు వస్తుంది.