రజిని సినిమా ఇంత తక్కువగానా..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా పేట. తమిళంతో పాటుగా తెలుగులో కూడా జనవరి 10న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తెలుగు బిజినెస్ అందరికి షాక్ ఇస్తుంది. తమిళ నటుడే అయినా తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న రజినికాంత్ సినిమా అంటే టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. అలాంటి రజిని నటించిన పేట సినిమా తెలుగులో కేవలం 12 కోట్లకు కొన్నారట.

లింగా సినిమా నుండి రజినికి ఫ్లాపులు ఎదురయ్యాయి. కబాలి, కాలాతో పాటుగా రీసెంట్ గా శంకర్ డైరక్షన్ లో 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 2.ఓ కూడా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు షాక్ ఇచ్చింది. అందుకే రజినికాంత్ పేట సినిమా కేవలం 12 కోట్లకే కోట్ చేశారట. తమిళ నిర్మాతలు అందుకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. అయితే బయటకు మాత్రం సినిమా తెలుగు రైట్స్ 20 కోట్ల దాకా చెబుతున్నారట.  

ఇక ఈరోజు రిలీజైన పేట ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. రజిని స్టైల్, యాక్షన్, డైలాగ్స్ అన్ని కలిసి కార్తిక్ సుబ్బరాజు రజిని ఫ్యాన్స్ కు సంక్రాంతి గిఫ్ట్ గా ఈ సినిమా ఇస్తున్నాడు. మరి పేట సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.