బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ లో 300పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు, 250 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన ఖాదర్ ఖాన్ (81) కెనడాలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఖాదర్ ఖాన్ కెనడాలో 17 వారాల పాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 1937 డిసెంబర్ 11న ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ లో జన్మించారు ఖార్ ఖాన్.     

1973లో రాకేష్ ఖన్నా నటించిన దాగ్ సినిమాలో నటించారు ఖాదర్ ఖాన్. ఆ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఖాదర్ ఖాన్ అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఖాదర్ ఖాన్ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ఖాదర్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ సిని ప్రముఖులు సంతాపం ప్రకటించారు.