బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవరంటే..!

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని అన్ని భాషలకు తెచ్చారు. ఇక తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేశాడు. రియాలిటీ షోనే కొత్త అనుకున్న టైంలో బుల్లితెర వ్యాఖ్యాతగా తారక్ దుమ్ము దులిపేశాడు. ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. మొదటి సీజన్ అంత సక్సెస్ కానున్నా కౌశల్ ఫాలోయింగ్ వల్ల సీజన్ 2 కూడా హిట్ అనిపించుకుంది.    

ఇక ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 3 గురించి చర్చలు మొదలు పెట్టారు. హిందిలో బిగ్ బాస్ 12 సీజన్లకు సల్మాన్ ఖాన్ ఒక్కడే వ్యాఖ్యాతగా చేస్తూ వచ్చాడు. కాని తెలుగులో అలా లేదు. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, రెండో సీజన్ నాని. 3వ సీజన్ మళ్లీ ఎన్.టి.ఆర్ చేస్తాడని అనుకున్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం విక్టరీ వెంకటేష్ బిగ్ బాస్ 3 హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈమధ్య రియాలిటీ షోల మీద ఆడియెన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే వెంకీ కూడా హోస్ట్ గా మారేందుకు సిద్ధమవుతున్నాడట. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి రెండు సీజన్లకు నాగార్జున, 3వ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా సక్సెస్ సాధించారు. మరి వెంకీ ఒకవేళ బిగ్ బాస్ కు వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.