
బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి డైరక్షన్ లో వచ్చిన సినిమా సింబా. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన టెంపర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. సబ్జెక్ట్ అదే అయినా బాలీవుడ్ లో స్క్రీన్ ప్లే మార్చి తీశారు. డిసెంబర్ 28న రిలీజైన సింబా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ మాత్రం బాగా రాబడుతుంది.
రిలీజైన నాలుగు రోజుల్లో ఈ సినిమా 100 కోట్లను క్రాస్ చేసింది. సారా ఆలీ ఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. దీపికాతో పెళ్లి తర్వాత రణ్ వీర్ నుండి వచ్చిన ఈ సినిమా సక్సెస్ కొట్టడం ఈ హీరో క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు బాలీవుడ్ లో కాప్ ఫార్ములా మూవీస్ ఎప్పుడు సక్సెస్ అవుతుందని మరోసారి సింబా ప్రూవ్ చేసింది.