
యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ పిఎస్వి గరుడవేగ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం రాజశేఖర్ కల్కి సినిమా చేస్తున్నాడు. అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్కిని డైరెక్ట్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా కల్కి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. రాజశేఖర్ స్టైలిష్ లుక్ తో కల్కి పోస్టర్ వచ్చింది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా 1983 నేపథ్యంలో నడుస్తుందట.
2018లో వచ్చిన రాం చరణ్ రంగస్థలం సినిమా కూడా సుకుమార్ అలానే చేశాడు. అ! తో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమా కాన్సెప్ట్ అర్ధమయ్యేలా హ్యాపీ న్యూ ఇయర్ 1983 అని పోస్టర్ మీద రాశారు. సి కళ్యాణ్ తో పాటుగా కల్కి సినిమాను జీవిత రాజశేఖర్ కలిసి నిర్మిస్తున్నారు.