ఆర్.ఆర్.ఆర్ కొత్త టైటిల్..!

రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చరణ్, ఎన్.టి.ఆర్ మల్టీస్టారర్ సినిమాపై రోజుకో వార్త చెక్కర్లు కొడుతుంది. మెగా నందమూరి క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రోజే ఆర్.ఆర్.ఆర్ అంటూ హంగామా మొదలు పెట్టాడు రాజమౌళి. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అని పెడుతున్నారని అన్నారు. అయితే ఇప్పుడు టైటిల్ గా మరో పేరు వినపడుతుంది.

లేటేస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ సినిమాకు టైటిల్ గా రాజసం అని పరిశీలిస్తున్నారట. ఇద్దరు హీరోలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్ మొదలు పెడుతున్న ఈ సినిమా అసలు టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. సినిమాలో హీరోయిన్స్ విషయంలో కూడా త్వరలో ఓ నిర్ణయానికి వస్తారట.