విశాల్ కు జోడీ కుదిరిందా..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు పెళ్లి ఫిక్సయ్యిందని తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా వరలక్ష్మి శరత్ కుమార్ తో విశాల్ లవ్ స్టోరీ అందరికి తెలిసిందే. అయితే ఈమధ్య తమ మాటల ప్రస్థావనలో విడిపోయాం అన్నట్టుగానే చెప్పుకొచ్చారు. విశాల్ కాస్త కూస్తో మొహమాట పడ్డాడేమో కాని వరలక్ష్మి మాత్రం విశాల్ తో కటీఫ్ అనేసింది. ఇక లేటెస్ట్ గా విశాల్ కు నెల్లూరికి చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యిందని విశాల్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్లి అక్కడ సెటిల్ అయిన ఫ్యామిలీలో అమ్మాయితో విశాల్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట. అమ్మాయి పేరు కూడా అనీష అని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో విశాల్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగు వాడే అయినా విశాల్ కోలీవుడ్ లో మంచి స్టార్ డం తెచ్చుకున్నాడు. విశాల్ తండ్రి జి.కె రెడ్డి ఎనౌన్స్ చేశారు కాబట్టి 2019 లో విశాల్ వెడ్డింగ్ కన్ఫాం అన్నమాట.