విజయ్ ఇస్తున్న న్యూ ఇయర్ మెసేజ్

యువ హీరో విజయ్ దేవరకొండకు 2018 బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా నోటా ఫ్లాప్ అయినా ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా మళ్ళీ  విజయ్ స్టామినాను ప్రూవ్ చేసింది. రిలీజ్ కు ముందే సినిమా రష్ లీకైనా సరే టాక్సీవాలా విజయ్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఇక విషయం ఏదైనా తన రౌడీ ఫ్యాన్స్ కు స్పెషల్ గ్రీటింగ్స్ అందచేసే విజయ్ న్యూ ఇయర్ కు ఫ్యాన్స్ కు తన తరపున మెసేజ్ ఇచ్చేస్తున్నాడు.

ఇంతకీ విజయ్ ఫ్యాన్స్ కు ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే కూల్ గా కూర్చుని తన సినిమాలు చూడాలని అంటున్నాడు. టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరో చేయని సాహసాలు చేసి ఫ్యాన్స్ ను అలరిస్తానని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. తన ఫ్యాన్స్ కు తాను ఇచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే అంటూ విజయ్ తన సోషల్ బ్లాగ్ లో చెప్పొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ డైరక్షన్ లో డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు.