
రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిలో టాలీవుడ్ స్టార్స్ అంతా అటెండ్ అయిన విషయం తెలిసిందే. జైపూర్ లో జరిగిన ఈ వెడ్డింగ్ లో ఎన్.టి.ఆర్, ప్రభాస్, రాం చరణ్, రానా, నాగార్జున, నానిలు హాజరవడం జరిగింది. ఇక సంగీత్ వేడుకలో స్టార్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచాయని తెలుస్తుంది. స్టార్స్ అంతా చిన్నపిల్లల్లా మారి ఎంజాయ్ చేశారు. ఇక ఈ వేడుకలో భాగంగా ఎన్.టి.ఆర్ నోట జై బాలయ్య అన్న మాట వచ్చింది.
ఈమధ్య బాబాయ్, అబ్బాయ్ ల మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. హరికృష్ణ మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీలో మార్పులు వచ్చాయి. అరవింద సమేత సినిమాకు బాలకృష్ణ గెస్ట్ గా రాగా.. రీసెంట్ గా జరిగిన ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియోలో నందమూరి కుటుంబం మొత్తం అటెండ్ అయ్యింది. ఎన్.టి.ఆర్ కూడా బాలయ్య బాబాయ్ ను పొగుడుతూ ఇచ్చిన స్పీచ్ అదిరింది. ఇప్పుడు కార్తికేయ, పూజా ప్రసాద్ ల పెళ్లిలో ఎన్.టి.ఆర్ జై బాలయ్య అనడం హాట్ న్యూస్ గా మారింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.