త్రివిక్రంతోనే బన్ని.. అఫిషియల్ అనౌన్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత చేసే సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. కొన్నాళ్లుగా బన్ని నెక్స్ట్ సినిమాపై వచ్చిన వార్తలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలా వార్తల్లో ఉన్నట్టుగానే త్రివిక్రం ఓ అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడు. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణతో పాటుగా అల్లు అరవింద్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాడు.

నా పేరు సూర్య రిలీజై ఆరు నెలలు పైన కావొస్తున్నా బన్ని తన తర్వాత సినిమా విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. విక్రం కుమార్ తో సినిమా దాదాపు ఓకే అనుకోగా ఎందుకో మధ్యలో వద్దనుకున్నారు. ఫైనల్ గా బన్ని, త్రివిక్రం మరో సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ క్రేజీ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి హిట్ అందుకున్నాయి. హ్యాట్రిక్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.