
కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా రీమేక్ గా తెలుగులో దటీజ్ మహాలక్ష్మి, తమిళంలో పారిస్ పారిస్ గా వస్తున్నాయి. తమన్నా తెలుగులో చేస్తున్న ఇదే సినిమాను తమిళంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రెండు సినిమాలకు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది. తెలుగు టీజర్ కన్నా తమిళ టీజర్ సూపర్ హిట్ అయ్యింది. అలా ఎందుకు అంటే పారిస్ పారిస్ టీజర్ లో కాజల్ తన స్నేహితురాలితో ఓ సీన్ అందరికి షాక్ ఇచ్చింది.
ఆ సీన్ పై విమర్శలు కూడా వచ్చాయి. కాని వాటిని తమిళ దర్శకుడు రమేష్ అరవింద్ కొట్టిపారేశాడు. ఆ సీన్ లో తనకు ఏమాత్రం తప్పు అనిపించలేదని. ఒరిజినల్ వర్షన్ లో అలానే ఉందని.. అయితే ఆ సీన్ ముందు తర్వాత చూస్తే అలా ఎందుకు చేయాల్సి వస్తుందో తెలుస్తుందని అన్నాడు రమేష్ అరవింద్. ఈ సినిమాను తెలుగులో అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.