టాలీవుడ్ హీరోలంతా జైపూర్ వెళ్తున్నారు..!

టాలీవుడ్ హీరోలంతా ఉన్నట్టుండి జైపూర్ వెళ్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్, అనుష్క అక్కడికి చేరుకున్నారు. ఈరోజు రాం చరణ్, ఎన్.టి.ఆర్, రానా, నాని ఇలా అందరు స్టార్స్ జైపూర్ వెళ్తున్నారు. ఇంతకీ ఎందుకు వీరంతా వెళ్తున్నారు అంటే రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ పెళ్లి ఈ నెల 30న జైపూర్ లో ఓ స్టార్ హోటల్ లో జరుగనుంది. 

డిసెంబర్ 30న పెళ్లి ఫిక్స్ చేయగా ఆ తర్వాత హైదరాబాద్ లో రిసెప్షన్ ప్లాన్ చేశారట. రాజమౌళి ఈ పెళ్లి కోసమే సెట్స్ మీద ఉన్న ఆర్.ఆర్.ఆర్ కు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ట్రిపుల్ ఆర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పిరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది.