
యువ హీరో విజయ్ దేవరకొండ అప్పుడే పెళ్లి ముచ్చట్లు చెబుతున్నాడు. ఈ ఇయర్ గీతా గోవిందం, టాక్సీవాలా రెండు హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం భరత్ కమ్మ డైరక్షన్ లో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. గీతా గోవిందం సినిమాతో ఈ ఇద్దరి పెయిర్ క్రేజీగా మారింది.
ఇక పెళ్లి గురించి అడిగితే దానికి కాస్త టైం ఉంది కాని చేసుకుంటే మాత్రం కాకినాడ పిల్లనే చేసుకుంటా అంటున్నాడు విజయ్ దేవరకొండ. అతను అలా చెప్పడానికి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. తనని తనుగా ప్రేమించే అమ్మాయి తనకు కావాలని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉండాలని అంటున్నాడు విజయ్. చూస్తుంటే విజయ్ త్వరలోనే పెళ్లి బాజాలు మోగించేలా ఉన్నాడనిపిస్తుంది. డియర్ కామ్రెడ్ సినిమా కాకినాడలోనే షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడి అందమైన అమ్మాయిలను చూశాడో ఏమో చేసుకుంటే కాకినాడ పిల్లనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు విజయ్.