
మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు కె.టి.ఆర్, చిరంజీవితో పాటుగా త్రివిక్రం కూడా వచ్చారు.
యువ నాయకుడు కె.టి.ఆర్ ఓ డైనమిక్ లీడర్ అని చిరంజీవి అన్నారు. ఇక ఈ వేడుకకు వచ్చిన కె.టి.ఆర్ కూడా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. కె.టి.ఆర్ చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్, ఆడియో రిలీజ్ రిలీజ్ చేశారు. ఇక ఈ వేడుకలో మరో అరుదైన దృశ్యం ఏంటంటే త్రివిక్రం, దేవిల కలయిక.
అఆ ముందు వరకు త్రివిక్రం సినిమా అంటే దేవి మ్యూజిక్ ఉండాల్సిందే. కాని ఇద్దరి మధ్య ఏదో డిస్టబెన్స్ వచ్చి అఆ కి మిక్కి జే మేయర్, అజ్ఞాతవాసికి అనిరుద్, అరవింద సమేత కోసం తమన్ లను తీసుకున్నాడు త్రివిక్రం. దేవితో గొడవల వల్లే త్రివిక్రం అతన్ని దూరం పెట్టాడని అన్న్నారు. అయితే వివిఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రం, దేవిల కలయిక అందరిని అలరించింది. లోపల ఏమున్నా పైకి మాత్రం ఇద్దరు ఆత్మాయంగా పలుకరించుకున్నారు.