
దాదాపు 10 ఏళ్లుగా పన్ను కట్టని కారణంగా సిని హీరో మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తున్నట్టు జిఎస్టి కమీషనర్ వెళ్లడించారు. 2007-08 సంవత్సరానికి గాను వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చిన మొత్తంలో మహేష్ 18.5 లక్షల సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే రోజులు గడుస్తున్నా మహేష్ ఎంతకీ ఆ ట్యాక్స్ చెల్లించలేదట. దాదాపు పదేళ్లు ఎదురుచూసిన అధికారులు ఏకంగా మహేష్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్టు తెలుస్తుంది.
మహేష్ 73.5 లక్షలు ట్యాక్స్ చెల్లించాల్సిదిగా బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. మహేష్ వాటిని మర్చిపోయాడా లేక నిజంగానే స్కిప్ చేశాడో తెలియదు కాని మహేష్ ఖాతాలను సీజ్ చేయడం అది కూడా ఒక 18 లక్షల రూపాయల కోసం అనే వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది. సినిమాకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే మహేష్ కు ఇది పెద్ద మొత్తం కాదని చెప్పొచ్చు. మరి ఈ విషయంపై మహేష్ స్పందన ఏంటి అన్నది చూడాలి.