బోయపాటి మార్క్ వినయ విధేయ రామ ట్రైలర్

మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి కాంబినేషన్ లో ప్రెస్టిజియస్ గా వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితం జరిగింది. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా కె.టి.ఆర్ అటెండ్ అవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రం కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఇక సినిమా ఆడియో సిడితో పాటుగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు కె.టి.ఆర్.

బోయపాటి సినిమా అంటే ఉండే అంచనాలకు తగినట్టుగానే వి.వి.ఆర్ ట్రైలర్ ఉంది. ముఖ్యంగా రాం చరణ్ లోని మాస్ యాంగిల్ ను ఏ రేంజ్ లో వాడేశాడో ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ చూసే మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.