తిత్లీ బాధితుల కోసం బన్ని సాయం

శ్రీకాకుళం జిల్లాలో ఈమధ్య వచ్చిన తిత్లీ తుఫాను వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధితులకు అండగా నిలిచేందుకు స్టార్స్ కొంత విరాళాలు అందించారు. ఇదిలాఉంటే తిత్లీ బాధితుల కోసం ఇచ్చిన మాట ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాడు. మూడు చోట్ల ఆర్వో ప్లాంట్ ఏర్పాట్లకు తన సహకారం అందించారు అల్లు అర్జున్. శ్రీకాకుళం జిల్లాల్లో శుభ్రమైన తాగు నీరు దొరకడం కష్టం. తుఫాను వచ్చినప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.    

అందుకే ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించాడు అల్లు అర్జున్. జిల్లాలోని కొండలోగాం.. దేవునాల్తాడ.. అమలపాడు.. పొలాకి.. నాలుగు గ్రామాలకు మూడు ఆర్వో ప్లాంట్ ఏర్పాట్లకు సంబందించి అల్లు అర్జున్ ఆర్ధిక సాయం చేశారు. దీని వల్ల అక్కడ కొంత మంచి నీటి సమస్య తగ్గుతుందని చెప్పొచ్చు. బన్ని చేసిన ఈ సాయానికి అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంతేకాదు బన్నిపై నెటిజెన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.