పిరియాడికల్ మూవీగా విరాటపర్వం..!

హీరోలలో దగ్గుబాటి రానా కచ్చితంగా డిఫరెంట్ అని చెప్పొచ్చు. బాహుబలి లాంటి సినిమాలో నటించి ప్రభాస్ తో పాటుగా రానా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలికి తగినట్టుగానే భళ్లాలదేవ గట్టి పోటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా కూడా రానా ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. 

సురేష్ బాబు నిర్మాణంలో 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాతో పాటుగా మరో పిరియాడికల్ మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు రానా. నీదీ నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న వేను ఊడుగుల విరాటపర్వం 1992 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రానా, సాయి పల్లవి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఓ పక్క స్టార్ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తూనే రానా ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. మరి రానా చేస్తున్న ఈ ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.