భాగమతి డైరక్టర్ తో సాయి ధరం తేజ్..!

కెరియర్ మొదట్లో హిట్లు అందుకుని కాస్త అతి చేసినట్టు కనిపించిన మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇప్పుడు వచ్చిన ఇమేజ్ దక్కించుకోవడంలో కష్టపడుతున్నాడు. కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన తేజ్ ఐలవ్యూ కూడా నిరాశపరచడంతో కొద్దిపాటి గ్యాప్ తో సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమా మొదలుపెట్టాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది.

ఇదిలాఉంటే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయి ధరం తేజ్. పిల్ల జమిందార్, భాగమతి సినిమాలతో తన సత్తా చాటుకున్న అశోక్ తేజూకి ఓ కథ చెప్పాడట. లైన్ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మన్నాడట. చిత్రలహరి సినిమా పూర్తి కాగానే అశోక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ఉంది. తేజ్ కెరియర్ మీద మెగా ఫ్యామిలీ ఫోకస్ పెట్టింది. అందుకే అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది.