రామ్ అండ్ పూరి.. బోల్డ్ అండ్ వైల్డ్ మూవీ..!

మెహబూబా సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు. ఇక తన తర్వాత సినిమా క్రేజీ కాంబినేషన్ లో సెట్ అయ్యింది. ఎనర్జిటిక్ స్టార్ రాం హీరోగా పూరి సినిమా మొదలవుతుందట. ఈ సినిమా గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తూ పూరి, రామ్, ఛార్మి దిగిన పిక్ షేర్ చేశాడు రామ్. మంచోడి పాత్రలు చేసి అలసిపోయినప్పుడు ఈ చెడ్డవాడిని కలుస్తారు.. తనకు ఆల్ టైం ఫేవరేట్ డైరక్టర్స్ లో ఒకరైన పూరితో #రాపో17 మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు రామ్.   

ఈ బోల్డ్ వైల్డ్ మూవీ కోసం ఎక్సైటింగ్ గా ఉన్నా అని కామెంట్ పెట్టాడు. సో దీన్ని బట్టి చూస్తే పూరి మళ్లీ ఓ బోల్డ్ అండ్ వైల్డ్ సబ్జెక్ట్ తో వస్తున్నాడని అనుకోవచ్చు. సెల్ఫీతో సినిమా అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన రామ్ కాంబినేషన్ మీద బాగా నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తుంది. మరి పూరి, రామ్ కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి. ఈ సినిమాను పూరి జగన్నాథ్ నిర్మిస్తుండటం విశేషం.