
నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ కథానాయకుడు డిజిటల్ రైట్స్ లో దుమ్ముదులిపేసింది. మొదటి పార్ట్ డిజిటల్ రైట్స్ 25 కోట్లకు కొనేశారట. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు అమేజాన్ ప్రైం. కేవలం మొదటి పార్టుకే ఈ రేటు ఫిక్స్ చేశారు. ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడవలేదు.
థియేట్రికల్ రైట్స్ కూడా భారీ రేటుకే అమ్ముడయ్యేలా ఉన్నాయి. ఎలా లేదన్నా పెట్టుబడి మొత్తం కథానాయకుడు మూవీతోనే తెచ్చుకునేలా ఉన్నారు ఎన్.టి.ఆర్ దర్శక నిర్మాతలు. ఇక సెకండ్ పార్ట్ మహానాయకుడు ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా నందమూరి ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని తెలుస్తుంది. మరి డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో అదరగొడుతున్న ఈ సినిమా వసూళ్ల హంగామా ఎలా ఉంటుందో చూడాలి.