శర్వానంద్ ఒప్పేసుకున్నాడు..!

శర్వానంద్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా పడి పడి లేచె మనసు. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని తెలిసిందే. మొదటి భాగం బాగా తీసిన దర్శకుడు సెకండ్ హాఫ్ సినిమాను చెడగొట్టేశాడని అందరు అనుకుంటున్నారు. రివ్యూస్ కూడా అలానే చెప్పడంతో సినిమా థ్యాంక్స్ మీట్ లో శర్వానంద్ వీటిపై స్పందించాడు.

సినిమాలో కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని.. సెకండ్ హాఫ్ పై వస్తున్న విమర్శలను స్వీకరిస్తున్నామని.. ఇక మీదట వేరే సినిమాల్లో ఆ తప్పు జరుగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు శర్వానంద్. థ్యాంక్స్ మీట్ లో మా సినిమా సూపర్ డూపర్ హిట్ అనే అందరు చెబుతారు కాని దానికి భిన్నంగా పబ్లిక్ టాక్ కు శర్వానంద్ స్పందించడం గొప్ప విషయమని చెప్పాలి.