త్రిష కొంపముంచిన రానా..!

బాలీవుడ్ క్రేజీ షో కాఫీ విత్ కరణ్ కు అటెండ్ అయిన బాహుబలి టీం ఎన్నో విషయాలను పంచుకున్నారు. రాజమౌళి, రానా, ప్రభాస్ లు కరణ్ ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలు ఇచ్చారు. అయితే కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలు రానా, ప్రభాస్ ల పర్సనల్ విషయాలను ప్రస్థావించాడు. బాలీవుడ్ లో ఇలాంటివి కామనే. ప్రభాస్ తో అనుష్క రిలేషన్ గురించి అడుగగా అది మీరు చేసిన ప్రచారమే అని తప్పించుకున్నాడు.

ఇక అదే సమయంలో త్రిషతో రానా రిలేషన్ బయటపెట్టాడు. త్రిష నువ్వు ఎందుకు విడిపోయారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదు లాంటి ప్రశ్నలు అడిగాడు. అయితే రెండు నెలలు కలిసున్నాం కాని ఆమెతో సెట్ అవదని తెలిసి విడిపోయాం అన్నట్టుగా చెప్పాడు రానా. రానా అలా చెప్పిన దగ్గర నుండి త్రిషని ఎటాక్ చేయడం మొదలుపెట్టారట. రానా, త్రిషల మధ్య రిలేషన్ నిజమే అని రానా చెప్పిన కామెంట్స్ బట్టి ప్రూవ్ అయ్యింది. ఈ విషయంపై త్రిష రెస్పాన్స్ తెలుసుకునేందుకు మీడియా వాళ్లు త్రిషకు ఫోన్ చేస్తున్నారట. వారి తాకిడి ఎక్కువవడం వల్ల త్రిష సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుందట. మీడియా ముందుకొచ్చాక అయినా రానా విషయంపై ఆమె స్పందించాల్సి ఉంటుంది.