
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఒకే కథను రెండు పార్టులుగా చేస్తున్న ఈ సినిమా ఆడియో వేడుక రీసెంట్ గా జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దర్శక నిర్మాతలు చిన్న క్లూస్ కూడా వదులుతున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ ఏంటో బయటకు వచ్చేసింది.
ఎన్.టి.ఆర్ భార్య బసవతారకం క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా ఆపరేషన్ బయట ఎన్.టి.ఆర్ తన జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సన్నివేశంతో ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదలవుతుందట. దీన్ని బట్టి చూస్తుంటే మహానటి సినిమాలో కూడా సావిత్రి కోమాలో ఉన్నప్పుడు సీన్ గుర్తుకు రాక మానదు. మహానటి సినిమా పంథాని ఫాలో అయినట్టు కాకుండా ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా ఫ్లాష్ బ్లాక్ గా చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ చేసిన ఈ సాహసం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.