
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా అంతరిక్షం. తెలుగు సినిమా చరిత్రలో మొదటి స్పేస్ మూవీగా ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలమైంది. ఘాజితో తన సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి అంతరిక్షం సినిమాను కొత్తగా తీశాడు. అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ కాస్త అటు ఇటుగా ఉండటం వల్ల డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఆఫ్టర్ రిలీజ్ కూడా ఈ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రమోషన్స్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. సినిమా చూసిన వారికి ఈ మేకింగ్ వీడియో చూస్తే సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా అంతరిక్షం మూవీ ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు నచ్చే ఆడియెన్స్ కాకుండా కొత్తదనం కోరుకునే వారికి తప్పకుండా నచ్చుతుంది.