
డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను తెరంగేట్రం చేయించాడు అల్లుడు శీను నుండి రీసెంట్ గా వచ్చిన కవచం వరకు బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నా ఫలితాలు మాత్రం పెద్దగా రాబట్టడం లేదు. ముఖ్యంగా శ్రీనివాస్ సినిమాలు బడ్జెట్ ఎక్కువవడం వల్లే అతనికి హిట్లు దూరమవుతున్నాయని అంటున్నారు.
ఇదిలాఉంటే ఇప్పుడు బెల్లంకొండ ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీకి సిద్ధమయ్యాడట. బెల్లంకొండ సురేష్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడట. నూతన దర్శకుడు చేస్తున్న సినిమాతో గణేష్ ఎంట్రీ షురూ అవుతుందట. బెల్లంకొండ వారసుడిగా గణేష్ అయినా హిట్లు కొడతాడేమో చూడాలి. బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికొస్తే ప్రస్తుతం తేజ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సీత అని టైటిల్ ఫిక్స్ చేశారట.