
నిన్నటితరం హీరోలుగా ఉన్న జగపతి బాబు, శ్రీకాంత్ ల కెరియర్ దాదాపు ముగిసినట్టే అనుకున్నారు. లెజెండ్ ముందు దాకా సోలో హీరోగా ట్రై చేసిన జగపతి బాబు విలన్ గా టర్న్ తీసుకునే సరికి ఊహించని విధంగా మళ్లీ కెరియర్ ఊపందుకుంది. లెజెండ్ నుండి ఈమధ్య వచ్చిన అరవింద సమేత వరకు జగపతి బాబు విలనిజంతో అదరగొడుతున్నాడు. అయితే ఇదే పంథాని కొనసాగించాలని ట్రై చేశాడు శ్రీకాంత్.
అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణం సినిమాలో విలన్ గా ఓ ట్రైల్ వేశాడు శ్రీకాంత్. కృష్ణ మరిముత్తు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. జెబి లక్ శ్రీకాంత్ కు కలిసి రాలేదు. అయితే విలన్ గా యుద్ధం శరణం హిట్ కొడితే మాత్రం తాను కూడా అలాంటి పాత్రలు కొనసాగించే వాడిని అంటున్నాడు శ్రీకాంత్. మొదటిది టార్గెట్ మిస్సైంది ఓకే మరో ప్రయత్నం చేస్తే పోలా అనేస్తున్నారు ఆడియెన్స్.