
స్టార్ సినిమా రిలీజైతే సినిమాకు సెలబ్రిటీ కామెంట్స్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతాయి. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా గురించి ట్వీట్ చేస్తే ఆ సినిమా బాగుంటే ఓకే కాని అది ఫ్లాప్ అయితేనే కొద్దిగా ఇబ్బంది పడతాడు. ఇదే విషయం ప్రస్థావిస్తూ తనకు నచ్చకపోయినా కొన్ని సినిమా గురించి ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. బాహుబలి టీం తో కాఫ్ విత్ కరణ్ షోతో పాల్గొన్న రాజమౌళి ఈ విషయాన్ని వెళ్లడించాడు.
కొన్నిసార్లు మొహమాటానికి కొన్ని సినిమాలు నచ్చకపోయినా బాగుందని ట్వీట్ చేయాల్సి వచ్చిందని. అలా చేసిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు రాజమౌళి. రాజమౌళి అలా చేసిన సినిమాలు కొన్ని ఆడియెన్స్ కు తెలిసినవే. మరి దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఇలా చేయడం అందరికి షాక్ ఇస్తుంది. కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్, అనుష్క రిలేషన్ తో పాటుగా రానా, త్రిష ఎందుకు విడిపోయారన్న విషయాల మీద రెస్పాన్స్ రాబట్టాడు కరణ్ జోహార్.