వినయ విధేయ రామ కోసం మెగాస్టార్..!

రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న మూవీ వినయ విధేయ రామ బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే సినిమా మీద అంచనాలు పెంచాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవనున్న వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న జరుగనుంది.

ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. చరణ్ ప్రతి సినిమాకు చిరు సపోర్ట్ ఉండటం కామనే అయితే బోయపాటి మార్క్ మూవీగా వస్తున్న ఈ వినయ విధేయ రామ సినిమా విషయంలో చిరు పెద్దగా జోక్యం చేసుకోలేదట. మెగా హీరో అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను చేసిన సరైనోడు సూపర్ హిట్ అయ్యింది. అదే క్రమంలో ఇప్పుడు వినయ విధేయ రామ కూడా మరోసారి చరణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తాడని అంటున్నారు.