ఎన్.టి.ఆర్ ట్రైలర్.. బాలకృష్ణ నట విశ్వరూపం..!

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఆడియో వేడుక శుక్రవారం సాయంత్రం జె.ఆర్.సి కన్వెన్షన్ లో జరిగింది. నందమూరి కుటుంబంతో పాటుగా సిని పరిశ్రమ పెద్దలు కూడా ఈ ఆడియో వేడుకకు అటెండ్ అవడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, రాఘవేంద్ర రావు, జమున, గీతాంజలి వంటి వారు ఈ ఆడియో వేడుకకు వచ్చారు.


ఎన్.టి.ఆర్ కళ్యాణ్ రాం తో పాటుగా సినిమాలో నటించిన రానా, సుమంత్ లు కూడా అటెండ్ అవడం జరిగింది. ఇక ఈ సందర్భంగా రిలీజైన ట్రైలర్ లో ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ తన నట విశ్వరూపం చూపించారు. పార్ట్ 1 కథానాయకుడు, పార్ట్ 2 మహానాయకుడు సినిమాలకు సంబందించి ఒకే ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూసి ఎన్.టి.ఆర్ బాబాయ్ లో పెద్దాయన కనబడుతున్నారని. ఇది చరిత్ర కాబట్టి హిట్ ఫ్లాపు కాదు చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. తాతయ్య బయోపిక్ చేసిందని బాలయ్య బాబాయ్ కు ధన్యవాదాలు తెలుపుతూ నందమూరి కుటుంబం తరపున ఈ వేడుకలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. 

బాలకృష్ణ మాట్లాడుతూ..  ఈ సినిమా చేయడం తన అదృష్టమని.. అన్ని కుదిరితేనే ఇలాంటి సినిమాలు వస్తాయని. నాన్న గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇది పూర్తి చేయగలిగాం అని అన్నారు. బాలకృష్ణ నిర్మాతగా కూడా ఈ సినిమాకు వ్యవహరించారు అందుకే ఆడియో వేడుక మొత్తం ఆయనే స్టేజ్ మీద ఉండి చూసుకున్నారు.