ఎన్.టి.ఆర్ కు ఆహ్వానం అందింది..!

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వస్తున్న ఎన్.టి.ఆర్ మూవీ రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్రిష్ డైరక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుక రేపు డిసెంబర్ 21న జరుపనున్నారు. ముందు నిమ్మకూరులో ప్లాన్ చేసిన ఈ ఈవెంట్ హైదరాబాద్ లోనే ఫిక్స్ చేశారట. ఇక ఈ ఈవెంట్ కు నందమూరి ఫ్యామిలీ మొత్తం వస్తుందని అంటున్నారు. అయితే ఎన్.టి.ఆర్ కు బాలయ్య ఆహ్వానం అందిందా లేదా అన్న కన్ ఫ్యూజన్ ఉండేది.

ఎట్టకేలకు దానికి క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ విషయాలను వెళ్లడిస్తూ ఎన్.టి.ఆర్ తో పాటుగా నందమూరి ఫ్యామిలీ ఇంకా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, మోహన్ బాబు, ఆనాటి తారలు గీతాంజలి, జమున వంటి వారు ఈ ఆడియో రిలీజ్ కు వస్తారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ నటించిన అరవింద సమేత సినిమా ఈవెంట్ కు బాలకృష్ణ అటెండ్ అయ్యారు. అయితే ఈమధ్య మళ్లీ బాబాయ్, అబ్బాయ్ ల మధ్య దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. వాటికి సమాధానం చెప్పేలా ఎన్.టి.ఆర్ కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఆడియోకి వస్తాడని తెలుస్తుంది.