ఒకటి ప్రయోగం.. మరోటి ప్రేమ ప్రయాణం.. ఫ్రైడే ఫైట్ లో గెలుపెవరిదో..!

తెలుగు ఆడియెన్స్ ఆలోచన థోరణి మారింది.. ఓ రెండు మూడేళ్ల క్రితం దాకా ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు సెంటిమెంట్ సీన్స్ ఇలా ఒకేరకమైన మూస కథలను తీసిన దర్శక నిర్మాతలు వాటికి మంగళం పాడేశారు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు వీరు కూడా ప్రయోగాల బాట పడుతున్నారు. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల లెక్క వేరేలా ఉంది. కొత్త కొత్త కథలు వస్తున్నాయి.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్స్ వారి సత్తా చాటుతున్నారు. అదే దారిలో 2018ని క్రేజీగా ఎండ్ చేసేందుకు మరో రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి ప్రయోగాత్మక సినిమా కాగా.. మరోటి రెగ్యులర్ లవ్ స్టోరీ. వరుణ్ తేజ్ అంతరిక్షం తెలుగులో వస్తున్న మొదటి స్పేస్ కాన్సెప్ట్ మూవీ. ఘాజి సినిమా చేసిన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ చూసి కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు ఇదో గొప్ప అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.

శర్వానంద్, సాయి పల్లవి కలిసి నటించిన పడి పడి లేచే మనసు రేపు రిలీజ్ అవుతుంది. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా వస్తుంది. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశాయి. ఈ రెండు సినిమాలు జానర్లు ఒకదానికి మరొకటి సంబంధం లేదు.

ఇక ఈ వీకెండ్ బాక్సాఫీస్ ఫైట్ లో ఈ రెండు సినిమాలు ప్రధాన పాత్ర కాగా మరో రెండు డబ్బింగ్ సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో ఒకటి కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కె.జి.ఎఫ్ కాగా మరోటి ధనుష్ మాస్ మూవీ మారి-2. ఈ రెండు సినిమాల్లో కూడా యశ్ కె.జి.ఎఫ్ మీద అంచనాలున్నాయి. కోలార్ బంగారు గనుల కాన్సెప్ట్ తో తీసిన సినిమా ట్రైలర్ అదరగొట్టేసింది. ఈ సినిమాకు తెలుగులో రాజమౌళి ప్రమోట్ చేయడం సినిమాపై క్రేజ్ తెచ్చింది. ఇక ధనుష్ మారి సీక్వల్ గా వస్తున్న సినిమా మారి-2.   

ఈ సినిమా కూడా మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా కనిపిస్తుంది. మరి ఫ్రైడే ఫైట్ లో పాల్గొంటున ఈ సినిమాల్లో ఏది సూపర్ సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఎక్కువశాతం అంతరిక్షం సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత శర్వానంద్ పడి పడి లేచె మనసు సినిమా క్రేజ్ తెచ్చుకుంది. మరి వీటిలో ఏది సూపర్ హిట్ అవుతుందో చూడాలి.