ఎన్.టి.ఆర్ కు ఆర్జివి వెన్నుపోటు..!

బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ ఛాన్స్ తనకే వస్తుందని భావించాడో ఏమో కాని ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని ఆర్జివి సంచలన సినిమా మొదలుపెట్టాడు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ చేస్తున్నాదట ఆర్జివి. ఈ శుక్రవారం వెన్నుపోటు అనే లిరిక్ తో వచ్చే సాంగ్ రిలీజ్ చేస్తున్నాడట. అదే రోజున ఎన్.టి.ఆర్ బయోపిక్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.  

ఎన్.టి.ఆర్ బయోపిక్ వర్సెస్ ఆర్జివి సినిమా అన్నట్టుగా పోటీ ఏర్పడింది. అయితే కొన్నాళ్లుగా వర్మ చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర ఘోర వైఫల్యం పొందుతున్నాయి. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్.టి.ఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథానాయకుడు జనవరి 9న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ రావాల్సిన డేట్ న ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ వస్తుందని తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య ఫైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.