వరుణ్ ప్రతి సినిమా సర్ ప్రైజ్.. అసూయ కలుగుతుంది..!

మెగా హీరోగా వరుణ్ తేజ్ తన ప్రతి సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు అంతరిక్షం సినిమాతో వస్తున్నాడు వరుణ్ తేజ్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈ ఈవెంట్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అటెండ్ అయ్యారు. వరుణ్ పాజిటివ్ నెస్ తో తన దగ్గరకు అలాంటి వారిని వచ్చేలా చేస్తుందని.. మంచి కథలు కూడా వస్తున్నాయని అన్నారు చరణ్.

ఇక తన ప్రతి సినిమా సర్ ప్రైజ్ గా ఉంటుందని.. వరుణ్ ను చూస్తే అసూయ కలుగుతుందని అన్నాడు చరణ్. అంతరిక్షం లాంటి సినిమా అందరికి రాదు దానికి వరుణ్ కు కంగ్రాట్స్ చెబుతూ ఈ సినిమా తప్పకుండా అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. మాటల సందర్భంలో బాబాయ్ ప్రస్థావన కూడా తెచ్చాడు రాం చరణ్. ఈమధ్య బాబాయ్ స్పీచ్ లలో భయంతో వెనుకడుగేయడం కన్నా ఏదో ఒక పని మీద విజయం సాధించి భయాన్ని దూరం చేసుకోవాలని బాబాయ్ చెప్పిన మాటలు తనకు గుండెల్లోకి దూసుకెళ్లాయని ఉత్తేజబరితంగా మాట్లాడాడు చరణ్.