
రాయదుర్గం ప్రాంతంలో సర్వే నంబర్ 46లో సుమారు 84.30 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు కట్టారని శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులు అక్కడ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అయితే అక్కడ 2,200 గజాల్లో ప్రముఖ హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ కూడా ఉంది. గెస్ట్ హౌజ్ లో ఎవరు లేకపోవడం వల్ల గేటుకి నోటీసులు అంటించి ఇల్లు సీజ్ చేశారట. అయితే ఈ ఇష్యూపై ప్రభాస్ సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.
ఆ భూమి పత్రాలు తన వద్ద ఉన్నాయని.. ప్రైవేట్ వ్యక్తులు తనకు ఈ స్థలం అమ్మారని చెబుతున్నారు ప్రభాస్. ముందస్తు నోటీసులు లేకుండా అధికారులు ఎలా ఇల్లు సీజ్ చేస్తారని. ఈ స్థలాన్ని వదులుకునేది లేదని అంటున్నాడట. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల మధ్య మధ్య కోర్ట్ వివాదం నడుస్తుండగా సుప్రీం కోర్ట్ ఈ స్థలం ప్రభుత్వానిదే అని మూడు నెలలు క్రిందటే తీర్పు ఇచ్చింది. కాని ఎలక్షన్స్ ఉండటం వల్ల అధికారులు ఇప్పుడు యాక్షన్ చేపట్టారు. మరి న్యాయ పోరాటం చేస్తా అంటున్న ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి.