
రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. హీరోగానే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా చరణ్ వ్యవహరిస్తున్నాడట. అదెలా అంటే ప్రస్తుతం చరణ్ చేస్తున్న వినయ విధేయ రామ సినిమాకు డివివి దానయ్య నిర్మాత.
ట్రిపుల్ ఆర్ కూడా ఆయన నిర్మాణంలోనే వస్తుంది. అయితే రెండు ప్రాజెక్టులకు కలిపి 40 నుండి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకోవాల్సి ఉందట. కాని ఆ డబ్బులను ట్రిపుల్ ఆర్ లో పెట్టేయమని చెప్పాడట. తనకు రావాల్సిన మొత్తాన్ని సినిమా బడ్జెట్ లో పెట్టమని చెప్పాడట చరణ్. రాజమౌళి సినిమా కాబట్టి లాభాలు కంపల్సరీ ఆఫ్టర్ బిజినెస్ లాభాల్లో వాటా తీసుకోవాలని చరణ్ మెగా ప్లాన్. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.