
మెగా డాటర్ నిహారిక ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తుంది. తొలి సినిమా ఒక మనసు అన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కాని ఆ తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ రెండు, మూడు రోజులకే థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం శ్రీయ శరణ్ తో ది లిటిల్ బర్డ్ సినిమా చేస్తున్న నిహారిక లేటెస్ట్ గా సూర్యకాంతం మూవీ కూడా చేస్తుంది.
ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న ప్రణీత్ డైరక్షన్ లో సూర్యకాంతం మూవీ వస్తుంది. ఈ సినిమాలో నిహారికకు జతగా ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. సూర్యకాంతం ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. నిహారిక ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించడం గ్యారెంటీ అనేట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. మరి నిహారిక చేస్తున్న ఈ ప్రయత్నం అయినా సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం.