కళ్యాణ్ రాం 118 టీజర్

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. సినిమాటోగ్రాఫర్ గా సూపర్ సక్సెస్ లను అందుకున్న గుహన్ మొదటిసారి మెగాఫోన్ పట్టుకుని చేస్తున్న సినిమా 118. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. థ్రిల్లర్ కథగా వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రాం లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది.

సినిమాలో షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కుతుంది. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ కళ్యాణ్ రాం కెరియర్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. 118 టీజర్ పై నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. పటాస్ తర్వాత కళ్యాణ్ రాం హిట్ దక్కలేదు. మరి 118 అయినా ఆ కోరిక తీరుస్తుందో లేదో చూడాలి.