
అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గూఢచారి. తక్కువ బడ్జెట్ తో జేమ్స్ బాండ్ తరహా కథని డీల్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాకుండా స్టార్స్ సైతం అడివి శేష్ అటెంప్ట్ ను పొగిడేశారు. ఆ ఉత్సాహంతోనే అడివి శేష్ గూఢచారి సీక్వల్ కు రెడీ అవుతున్నాడు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా గూఢచారి పార్ట్ 2 ఎనౌన్స్ చేశాడు.
అయితే ఈ సీక్వల్ రెగ్యులర్ షూటింగ్ 2019 జూన్ నుండి మొదలవుతుందట. ఇప్పుడు జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు. 2020 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గూఢచారి సినిమాను తక్కువ బడ్జెట్ తో ముగించారు. కాని ఈ సీక్వల్ కు బడ్జెట్ కూడా ఎక్కువే పెట్టేస్తున్నారట. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి గూఢచారి 2020 ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సీక్వల్ ను రాహుల్ పాకాల డైరెక్ట్ చేస్తారట. గూఢచారి సినిమాకు రాహుల్ అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు.