
తెలంగాణా ఎన్నికలు ముగిశాయి.. మళ్లీ గుబాలి పార్టీకే తమ ఓటని ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమిగా ఏర్పడినా సరే కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజేఎఫ్ లు టి.ఆర్.ఎస్ విజయాన్ని ఆపలేకపోయారు. తెలంగాణాలో పొత్తులో భాగంగా టిడిపి తరపున 12 స్థానాల్లో అభ్యర్ధులు నిలబడ్డారు. వారి కోసం బాలకృష్ణ ప్రచారం కూడా చేశారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావు పేట అభ్యర్ధుల కోసం ప్రచారం చేసిన బాలకృష్ణ. హైదరాబాద్ లో ఆనంద్ ప్రసాద్, నందమూరి సుహాసినిల కోసం ప్రచారం చేశాడు.
ప్రచార సమయంలో కె.సి.ఆర్ ను ఎటాక్ చేశాడు బాలకృష్ణ. సీన్ మారితే తర్వాత పరిస్థితి ఏంటన్నది ఆలోచించకుండా బాలకృష్ణ టి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని ఏకేశాడు. అయితే అనుకున్నట్టుగా ఫలితం టి.ఆర్.ఎస్ కు అనుకూలంగా బంపర్ మెజారిటీ వచ్చింది. కె.సి.ఆర్ నాయకత్వంలో బాలకృష్ణ తెలంగాణాలో గడ్డు కాలమే అంటున్నారు కొందరు. సినిమాల పరంగా బాలకృష్ణకు అడ్డంకులు తప్పవని తెలుస్తుంది.
బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా ముహుర్త కార్యక్రమానికి కె.సి.ఆర్ ను ఆహ్వానించాడు బాలకృష్ణ. మరి ఇప్పుడు ఆ పరిస్తితి ఉంటుందా.. కేవలం అది ఎలక్షన్ టైం కాబట్టి అలా చేశాడని కె.సి.ఆర్ వదిలేస్తాడా లేక బాలకృష్ణ మీద స్పెషల్ ఫోకస్ పెడతాడా అన్నది చూడాలి.