
కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఫసాక్ అంటూ మాట్లాడటం పెద్ద హంగామానే జరిగింది. ఆ మాటకు అర్ధం ఏంటో తెలియదు కాని ఆయన హావభావాలు చూసి ట్రెండ్ అయ్యింది. ఇక ఈ ఫసాక్ అన్నది ఏ విధంగా ట్రోల్ అయ్యిందో తెలిసిందే. జనాల్లో బాగా వెళ్లిన ఫసాక్ అనే పదాన్ని టైటిల్ గా పెట్టబోతున్నారు. అది కూడా మంచు విష్ణు బ్యానర్ లో సినిమా అని తెలుస్తుంది.
మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ అయిన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీలో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారట. కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న మంచు విష్ణు ఈ క్రేజీ టైటిల్ రిజిస్టర్ చేయించడం మచు అభిమానులను ఉత్సాహపరుస్తుంది. ఆల్రెడీ పూర్తయిన మంచు విష్ణు ఓటర్ సినిమా రిలీజ్ కు మోక్షం కలగడం లేదు. మరి ఈ ఫసాక్ ఎవరి డైరక్షన్ లో వస్తుందో చూడాలి.