ట్రిపుల్ ఆర్ కోసం ఎన్.టి.ఆర్ రిస్క్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందని అంటున్నారు. సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా లీకైన ఎన్.టి.ఆర్ పిక్స్ చూస్తే అది నిజమే అనిపించేలా ఉంది.

సినిమాలో ఎన్.టి.ఆర్ ఓ గజదొంగగా కనిపిస్తాడట. చరణ్ పోలీస్ గా నటిస్తున్నాడట. అందుకే ఎన్.టి.ఆర్ కాస్త లావెక్కడంతో పాటుగా గెడ్డం కూడా పెంచాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరితో రాజమౌళి చేసిన సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఈ ట్రిపుల్ ఆర్ మీద కూడా వారు భారీ అంచనాలతో ఉన్నారు. అంతా బాగానే ఉన్నా నెగటివ్ షేడ్స్ చేస్తున్న తారక్ ట్రిపుల్ ఆర్ కోసం రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఎంత రాజమౌళి మీద నమ్మకం ఉన్నా ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ చేస్తున్నాడంటే నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.