
నవాబ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మణిరత్నం కోలీవుడ్ లో మరో భారీ మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఓ సినిమా చేస్తున్నాడట మణిరత్నం. ఇందులో హీరోలుగా విజయ్, విక్రం, శింబులు నటించే అవకాశాలున్నాయట. కోలీవుడ్ లో భారీ మల్టీస్టారర్ గా ఈ మూవీ రాబోతుంది.
అయితే దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. విజయ్, విక్రం ఇద్దరు స్టార్ హీరోలే అలాంటి ఆ ఇద్దరిని కలిపి మణిరత్నం చేసే ఈ ప్రాజెక్ట్ తప్పకుండా భారీ అంచనాలతో వస్తుంది. ఇంచుమించు రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ కు సరిసమానమైన క్రేజ్ ఈ మల్టీస్టారర్ కు ఉందని చెప్పొచ్చు. మణిరత్నం చేస్తున్న ఈ మెగా మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. దళపతి లాంటి మల్టీస్టారర్ సినిమాలను తీసిన అనుభవం ఉన్న మణిరత్నం ఈ క్రేజీ మల్టీస్టారర్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.