
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 2.ఓ. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో మంచి టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రజిని కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో పేటా మూవీ చేస్తున్నాడు. 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కష్టమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
రజిని స్టామినా పరంగా తెలుగులో ఇదవరకు భారీ వసూళ్లను రాబట్టాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. రజిని సినిమాలు ఆశించినంతగా తెలుగులో వసూళ్లు రాబట్టడం లేదు. 2.ఓ కూడా 70 కోట్లకు కొనగా ఇప్పటివరకు 35 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే సగానికి పైగా రాబట్టాల్సి ఉంది. రజిని ప్రస్తుతం చేస్తున్న పేట మూవీ పోస్టర్స్, ఆడియో ఇలా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తెలుగులో మాత్రం ఈ సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్ లేదు. అంటే తెలుగులో పేటా రావడం లేదన్నమాట. మరి రిలీజ్ టైం లో డెశిషన్ మార్చుకుని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారో ఏమో కాని 2.ఓ ఎఫెక్ట్ పేటా మీద బాగానే పడుతుందని మాత్రం చెప్పొచ్చు.