వినయ విధేయ ఫస్ట్ సాంగ్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రేజీ డైరక్టర్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ తందానే తందానే సాంగ్ వచ్చింది. ఫ్యామిలీ సాంగ్ గా వచ్చిన ఈ పాట ఇంప్రెసివ్ గా ఉంది.

ఫ్యామిలీ ఎమోషన్స్ తెలిసేలా ఉన్న ఈ పాట సినిమాలో కూడా అందంగా ఉంటుందని చెప్పొచ్చు. శ్రీరమణి అందించిన సాహిత్యం బాగుంది. అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఓకే అనేలా ఉన్న ఈ పాట ట్యూన్ మెగా ఫ్యాన్స్ కు నచ్చొచ్చు. 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న వినయ విధేయ రామ సినిమా బోయపాటి మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందని అంటున్నారు.  

రంగస్థలం తర్వాత తన జోష్ పెంచిన రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాతో కూడా సత్తా చాటేలా ఉన్నాడు. సినిమాలో చరన్ తో పాటుగా కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు.