బన్ని కూడా రిజెక్ట్ చేశాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల సెలక్షన్స్ లో కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు అన్నది విషయం అర్ధమవుతుంది. నా పేరు శివ వచ్చి 7 నెలలు అవుతున్నా సరే తన తర్వాత సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీకి రాలేదు. ప్రస్తుతం బన్ని కథలు వినడంలో బిజీగా ఉన్నాడు. ఇదిలాఉంటే లేటెస్ట్ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ లో బన్ని నటిస్తాడని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ ఇమేజ్ కు ఏమాత్రం సరిపోని సబ్జెక్ట్ అది.

ఆ సినిమాను బన్ని చేస్తే యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం లేదు. దిల్ రాజు బలవంతపెడితే స్పెషల్ షో వేసుకుని చూడట బన్ని. అయితే సినిమా బాగున్నా తనకు మాత్రం ఇది సెట్ అవదని చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న మెగా అండ్ బన్ని ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. 96 ఓ ఫీల్ గుడ్ మూవీ ఎలాంటి ఇమేజ్ లేని హీరోలు చేస్తే బెటర్ కాని బన్ని చేస్తే రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. అందుకే ముందుగానే బన్ని రిజెక్ట్ చేయడం మంచి విషయమని చెప్పుకుంటున్నారు.