
నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా పూర్తి అవకముందే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో నాని సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి నాని చేసిన ట్వీట్ క్రేజీగా మారింది. అమ్మాయిలు మీ కోసమే ఈ సినిమా అంటూ నాని ట్వీట్ చేయడం దీనితో పాటుగా నాతో పాటు ఐదుగురు అంటూ ఏప్రిల్ 19 నుండి మొదలు పెడతామని చెప్పడం విశేషం.
నా పేరు సూర్య తర్వాత విక్రం కుమార్ చెప్పిన కథకు బన్ని ఓకే చెప్పినా ఫైనల్ స్క్రిప్ట్ తో శాటిస్ఫై కాలేదట. అందుకే బన్ని విక్రం కుమార్ కు సారీ చెప్పాడు. బన్ని కాదనడంతో నానితో సినిమా షురూ చేస్తున్నాడు విక్రం కుమార్. ఈ సినిమాలో నానితో పాటుగా ఐదుగురు అమ్మాయిలు నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వారు హీరోయిన్స్ గానా కాదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.